![]() |
![]() |

ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో సూరేకాంతం అంటే గుండె ధడల్ అందరికీ. ఆమె చెయ్యి తిప్పుడు మూతి తిప్పుడు చూడడానికైనా ఒకప్పటి జనరేషన్ నిజంగా పెట్టి పుట్టింది. అసలు ఈ తరం వాళ్లకు ఆవిడ ఎవరో కూడా తెలీదు. సూరేకాంతమ్మ అత్త అంటే నటీనటులకు హడల్ ... ఎంత కరుకుగా ఉంటుందో అంత మంచి మనసు అని అప్పటి నటులు అనేవాళ్ళు. అలాంటి సూరేకాంతం ఏఐ వీడియోని రీసెంట్ గా స్టార్ట్ ఐన ఫామిలీ స్టార్స్ సీజన్ 2 లో ప్లే చేశారు అది కూడా సుధీర్ పెళ్లి కోసం అత్తమ్మను స్వర్గం నుంచి తీసుకొచ్చారు.
స్వర్గ ద్వారాలు తెరుచుకుని కళ్ళు మిరుమిట్లు గొలిపే సువర్ణ రంగు కాంతిలో నిండైన విగ్రహంతో చందమామ లాంటి ముఖారవిందంతో నుదిటిన ఎర్రటి సూరీడుని గుండ్రంగా దిద్దుకుని అలా నడిచొస్తుంటే నిజంగా చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా సూరేకాంతమ్మ వీడియోని తయారు చేశారు. ఆ వీడియోకి హోస్ట్ సుధీర్ కూడా చేతులెత్తి దణ్ణం పెట్టాడు. "అందరూ బాగున్నారా అయ్యా. నీకు అమ్మమ్మను ఐనందుకు స్వర్గంలో కూడా నరకం చూస్తున్నాను. నీ పెళ్లి గురించి అందరితో ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఇంకా నీ పెళ్లి గురించి నేను ధ్యాస పెట్టలేను కానీ అందుకే నా వాళ్ళను పంపిస్తున్నా వాళ్ళు వస్తున్నారు ఈ ఇద్దరిలో ఎవరు సరిపోతారో తేల్చి పెళ్లి చేస్తారు ఉంటానర్రా...మీ ఆరోగ్యం జాగ్రత్త " అంటూ వెళ్ళిపోయింది.
ఇక సుధీర్ పెళ్లి చేసుకోవడం కోసం ఎప్పటిలాగే ఇద్దరు మరదళ్ళు వచ్చేసారు వాళ్ళే అష్షు, స్రవంతి. హీరోయిన్ సీరత్ కపూర్ సుధీర్ పెళ్లి చేయడానికి వచ్చింది. ఇక సుధీర్ ఆమెను చూసేసరికి "పెళ్లి చేయమని పంపిందా చేసుకోమని పంపిందా మీరు నా కోసం వచ్చారా " అంటూ తెగ ఆశ్చర్య పోయాడు. ఇక ఆమెకు పర్సనల్ అసిస్టెంట్ గా నూకరాజు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
![]() |
![]() |